calender_icon.png 22 December, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడే పల్లె సారధుల ప్రమాణ స్వీకారం

22-12-2025 10:27:35 AM

మణుగూరు,(విజయక్రాంతి): నేడే గ్రామ పంచాయతీలలో సర్పంచ్, ఉప సర్పంచ్, నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం జరగనుంది .ఇటీవల జిల్లా లో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన విజేతలు  నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పలుచోట్ల కొత్త సర్పంచ్లు సొంతఖర్చులతో జీపీ భవనాలకు రంగులు, ఏమైనా మరమ్మతులు ఉంటే చేయిస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్లచే ప్రమాణ స్వీకారం జరుగనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నేటి నుండి నూతన సర్పంచ్‌ల పాలన అందుబాటులోకి 

రానున్నది.. దీనిపై విజయ క్రాంతి కథనం..

రెండు సంవత్సరాల నిరీక్షణకు తెర....

గత  రెండు సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు అవుతున్న పాలకవర్గం  గ్రామాలలో విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, విద్యుత్, పారిశుద్ధ్యం, కాల్వలు, వ్యవసాయ బావులు, చెరువుల అభివృద్ధి లాంటి మౌలిక సదుపాయాల అంశాలపై దృష్టి సాధించాల్సి ఉంది. అయితే ఈసారి గెలుపొందిన వారి లో అత్యధికులు కొత్తవారే ఉన్నారు. పాలన అనుభవం, రాజకీయ నేపథ్యం లేని వారే ఎక్కువ. మరోవైపు ఎన్నికల ప్రచారంలో గ్రామాలను అభివృద్ధి చేస్తామని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని అనేక 

హామీలిచ్చారు. ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. వారు ప్రజల నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకునేలా పాలన చేస్తారన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో వారికి పల్లెపాలన సవాల్‌గా మారనున్నది

ముగియనున్న ‘స్పెషల్' పాలన

జిల్లా వ్యాప్తంగా 471సర్పంచులు, 4168  వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్తపాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసే రోజే తొలి సమావేశం నిర్వహించ నున్నారు. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కలిసి ప్రమాణ స్వీకారం అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు తీర్మానాలు ఆమోదించనున్నారు. అయితే గత సర్పంచ్ ల పదవీకాలం ముగిసిన తర్వాత 2024 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమైన స్పెషలాఫీసర్ల పాలన ప్రస్తుతం సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణస్వీకారంతో ముగి యనుంది. వాస్తవానికి ఈనెల 20వ తేదీన గ్రామపంచాయతీల పాలక మండళ్ల ప్రమాణ స్వీకారం ఉండగా అనివార్య కారణాలతో వాయిదా వేశారు. దీంతో ఈనెల 22న (సోమవారం) సంబంధిత అధికారులు జీపీల్లో ప్రమాణస్వీకార 

కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, స్పెసల్ ఆఫీసర్లే సర్పంచ్లు, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించ నున్నారు. ప్రమాణ స్వీకారం చేసే రోజే  తొలి సమావేశం నిర్వహించనున్నారు.  గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ను చేపట్టేం దుకు తీర్మానాలు  ఆమోదించి, గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

పంచాయతీ కార్యాలయాలకు కొత్త సొగసులు....

ఉదయం 10 గంటల 05 నిమిషాలకు మంచి ముహూర్తం ఉండడంతో ఆ సమయానికి పదవి ప్రమాణ స్వీకారాలు చేయాలనే సంకల్పంతో నూతన సర్పంచులు శ్రమిస్తూ పంచాయతీ కార్యాలయాల కు సొగసులద్దుతున్నారు. ఇప్పటికే తమ,తమ బంధుమిత్రులను, శ్రేయోభిలా షులను ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్ర మాలకు  ఆహ్వానించారు. గ్రామాల ప్రజలకు ఆహ్వానాలు పంపారు. వారి ప్రమాణ స్వీకారోత్సవ  సమయం ఆసన్నమవు తుండడంతో ఉత్సాహంతో నూతన సర్పంచులు మధురానుభూతులకు లోన వుతున్నారు.