22-12-2025 10:30:13 AM
మంథని ఎస్ఐ డేగ రమేష్
మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని ఎక్లాస్పూర్ సమీపంలో గాడిదల గండిగుట్ట లో పేకాట శిబిరంపై దాడి చేసి పలువుడ్ని అరెస్ట్ చేసినట్లు మంథని ఎస్ఐ డేగా రమేష్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం ఆదివారం రాత్రి అందిన సమాచారం మేరకు ఆ ప్రాంతంలో 11 మంది కలిసి మూడు ముక్కలాట ఆడుతున్నారని, సిబ్బందితోనే అక్కడికి వెళ్ళగా ఎనిమిది మంది పారిపోయారని, ముగ్గురిని విచారించగా మొత్తం 11 మంది మూడు పత్తాలాట ఆడుతున్నట్లు తెలిపారని, మంథని కి చెందిన అన్నం శ్రీనివాస్, ఎనగందుల శేఖర్ కాకర్లపల్లి, మాదాడి రాజిరెడ్డి సూరయ్య పల్లి, మాచర్ల కుమార్ మంథని, నానువాళ్ళ నారాయణరెడ్డి ఎక్లాస్ పూర్, గడ్డం రమేష్ మంథని, బూడిద రాజయ్య మంథని, తీగల రాయనర్సు కాకర్లపల్లి, బొజ్జ రమేష్ కాకర్లపల్లి, గుత్తికొండ సరోత్తమ్ వరంగల్ జిల్లా, జింజర్ల సమ్మయ్య గంగాపురిలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో మూడు ఫోన్లు, రూ. 25 వేల రూపాయలు, 52 ప్లేయింగ్ కార్స్, మూడు బైక్స్ స్వాధీనం చేసుకున్నామని, వారిపై కేసు నమోదు చేశామని అన్నారు.