22-12-2025 02:58:08 AM
ఎల్బీనగర్, డిసెంబర్ 21 : మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ లో అగ్నిమాపక కేంద్ర నిర్మాణానికి సన్నాహాలు చేపడుతున్నట్లు రంగారెడ్డి జిల్లా ఫైర్ అధికారి- 2 బి. కేశవులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఫైర్ అధికారి కేశవులు, జిల్లా సహాయక అగ్నిమాపక అధికారి ( ఎల్బీనగర్) బి. శ్రీనయ్య సూచనలతో ఆదివారము స్థలంలో సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బి.కేశవులు మాట్లాడుతూ... సరూర్ నగర్, బాలాపూర్ ప్రజల అగ్ని ప్రమాద సంక్షేమం దృష్టా గత రెండు సంవత్సరాల క్రితం ఎల్బీనగర్ ఫైర్ స్టేషన్ ను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం , వాహనాలతో ఎల్బీనగర్ డివిజన్ హెడ్ ఆఫీస్ మంజూరు చేయడం జరిగిందన్నారు. ఫైర్ స్టేషన్ నిర్మాణానికి గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 900 గజాల స్థలంలో అగ్నిమాపక కేంద్ర నిర్మాణానికి సరూర్ నగర్ లో మంజూరు చేసిందన్నారు. 2026 సంవత్సరానికి అగ్ని మాపక కేంద్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ కేంద్ర అగ్ని మాపక అధికారి పి. శ్రీధర్, ఎల్బీనగర్ కేంద్ర అగ్ని మాపక అధికారి -2 బి.నర్సింహ సిబ్బంది పాల్గొన్నారు.