07-01-2026 12:18:42 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 6(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా వార్డుల వారిగా ఓటరు జాబితాపై ఈ నెల 9వ తేదీలోగా అభ్యంతరాలు అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంక టేష్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎం. డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల ప్రదేశాల విషయంలో అభ్యంతరాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అవకతవకలకు అవకాశం లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూతు స్థాయి ఏజెంట్లు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల కమిషనర్లు గజానన్, రాజేందర్, పట్టణ ప్రణాళిక అధికారి యశ్వంత్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధు లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.