calender_icon.png 9 January, 2026 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాలయాల పరిరక్షణ మనందరి బాధ్యత

07-01-2026 12:20:25 AM

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్

మొయినాబాద్, జనవరి 6 (విజయ క్రాంతి): దేశంలో దేవాలయాల  పరిరక్షణ మనందరి బాధ్యత అని, సనాతన ధర్మరక్షణకు ఇది అత్యంత అవసరమని, చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పేర్కొన్నారు. మంగళవారం మొయినాబాద్ మండల పరిధిలోని మోత్కుపల్లి గ్రామంలోని శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన శ్రీ చెన్నకేశవ దేవాలయాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రంగరాజన్ మాట్లాడుతూ.. మోత్కుపల్లి గ్రామంలో నవాబుల కాలంలో మోత్కుపల్లి గ్రామంలో ఉన్న చెన్నకేశవ దేవాలయాన్ని ఔరంగజేబు కూల్చడం జరిగిందని, దానిని ప్రస్తుతం అభివృద్ధి చేసి భక్తులకు దర్శనానికి కృషి చేయడం మోత్కుపల్లి సర్పంచ్ సంపూర్ణ రాములును ఆయన అభినందించారు. చెన్నకేశవ దేవాలయ అభివృద్ధి పనులు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.

గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, నూతన సర్పంచ్ సంపూర్ణ రాములు గెలుపొందిన రెండో రోజు నుండి దేవాలయ అభివృద్ధి పనులు ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈనెల 14, 15 తేదీలలో జరగనున్న చెన్నకేశవ స్వామి ఉత్సవాలకు ఆలయాన్ని అంగరంగ వైభవంగా సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఆలయ పునర్నిర్మాణంతో పాటు ఉత్సవ ఏర్పాట్లు వేగవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

1936 వరకు అణగారిన వర్గాలకు దేవాలయ ప్రవేశం లేకపోయిన పరిస్థితులను గుర్తు చేస్తూ.. అలాంటి సామాజిక నేపథ్యం నుంచి వచ్చిన సర్పంచ్ సంపూర్ణ రాములు దేవాలయ అభివృద్ధికి ముందడుగు వేయడం సామాజిక సమానత్వానికి, సనాతన ధర్మ విలువలకు నిదర్శనమని, రంగరాజన్ అన్నారు. గతంలో నవాబుల కాలంలో ఔరంగజేబు ఈ దేవాలయాన్ని కూల్చివేయగా..

గ్రామ ప్రజలు అప్పటి ముఖ్యమంత్రి టీ.అంజయ్య ఆధ్వర్యంలో ఆలయాన్ని తిరిగి నిర్మించారని తెలిపారు. అప్పటి నుంచి ఈ దేవాలయం భక్తులకు నిరంతరం దర్శన భాగ్యాన్ని కల్పిస్తోందన్నారు. గ్రామస్తులందరూ ఏకమై దేవాలయ అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని,  పేర్కొనారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలను మరియు సర్పంచ్ సంపూర్ణ రాములను రంగరాజన్ ప్రత్యేకంగా అభినందించారు.