calender_icon.png 9 January, 2026 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్‌గౌడ్‌ని కలిసిన కాంగ్రెస్ నాయకులు

07-01-2026 12:18:31 AM

ఘట్ కేసర్, జనవరి 6 (విజయక్రాంతి): నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు, ఎమ్మెల్సీ  బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, అల్ ఇండియా కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సభ్యులు గిడుగు రుద్రరాజు ని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం బీబ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్,

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, ఘనపురం మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి, రాష్ట్ర మహిళ కాంగ్రెస్ నాయకురాలు వరలక్ష్మి, కొమురవెల్లి దేవస్థానం ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, ఓబీసీ సెల్ అధ్యక్షులు మెట్టు రమేష్  మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.