30-10-2025 05:26:48 PM
యాదగిరిగుట్ట (విజయక్రాంతి): యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చే ప్రధాన రహదారి నేషనల్ హైవేకి పక్కన యాదాద్రి కలెక్టరేట్ కి చేరువలో రాయగిరి ఫ్లై ఓవర్ పక్కన రోడ్డుపైకి వరద నీరు భారీగా చేరడంతో వాహనదారులకు ప్రయాణ సమస్యలు ఏర్పడ్డాయి. వరద నీరు తొలగించడానికి పక్కనే ఉన్న సరైన మరమ్మత్తులు లేక, అధికారులు పట్టించుకోక నీరు రోడ్డుపైకి చేరి వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోని సరైన మరమత్తులు చేసి నీటిని తొలగించాల్సిందిగా స్థానికులు మరియు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.