calender_icon.png 31 October, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్చర్లలో వ్యర్థాల సేకరణ వేలం.. రూ.34.29 లక్షలు

30-10-2025 10:29:55 PM

జడ్చర్ల: గతంలో రెండుసార్లు వాయిదా పడిన జడ్చర్ల పురపాలక సంఘం పరిధిలోని చికెన్ వ్యర్థాల సేకరణ వేలం ఎట్టకేలకు గురువారం ముగిసింది. వ్యర్థాల సేకరణను జడ్చర్లకు చెందిన శ్రీకాంత్ రెడ్డి అత్యధికంగా రూ.34,29,000కు దక్కించుకున్నారు. మూడు గంటల పాటు పోటాపోటీగా సాగిన ఈ వేలంలో సి. రాజు, సయ్యద్ తహసీన్ పాల్గొన్నారు. వేలం దక్కించుకున్న వారు ఒక్క సంవత్సరం పాటు వ్యర్థాలను సేకరించేందుకు అనుమతులు జారీ చేయడం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి, చైర్ పర్సన్ కోనేటి పుష్పలత, వైస్ చైర్ పర్సన్ పాలాది సారిక మరియు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు