calender_icon.png 31 October, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతి లేని వికాస్ వొకేషనల్ కాలేజ్‌పై డీఐఈఓ నోటీసులు

30-10-2025 10:40:39 PM

సంగారెడ్డి (విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణం శాంతినగర్‌లో గుర్తింపు లేకుండా నడుస్తున్న వికాస్ వొకేషనల్ జూనియర్ కాలేజికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(డీఐఈఓ) గోవింద్‌రావు గురువారం ఒక పబ్లిక్ నోటీసు జారీ చేస్తూ, ఆ విద్యాసంస్థకు ప్రభుత్వ అనుమతి లేదని స్పష్టం చేశారు. గత సంవత్సరం నుండి కార్యకలాపాలు కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఆ కాలేజీకి ఎటువంటి గుర్తింపు మంజూరు కాలేదని తెలిపారు.

శాంతినగర్‌లోని ఐబీ ఎదుట ఉన్న ఈ కాలేజ్ గుర్తింపు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆ సంస్థలో చేర్పులు చేసుకోరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. గుర్తింపు లేని విద్యాసంస్థల్లో చదువుకోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే, ఆ కాలేజీలో ఇప్పటికే చేరిన విద్యార్థులపై ఇంటర్మీడియట్ బోర్డు, డీఐఈఓ కార్యాలయం ఎటువంటి బాధ్యత వహించబోదని గోవింద్‌రావు స్పష్టం చేశారు.