30-10-2025 10:37:02 PM
సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రం, మండల పరిధిలో ఉపాధి హామీ కూలీలు ఆధార్ ఈ కేవైసీకి ఈనెల 31 చివరి తేదీ కాబట్టి ఈ కేవైసీ తప్పనిసరి చేయించుకొవాలని ఏపిఓ బస్వరాజ్ కోరారు. ఇప్పటివరకు 79.1% సద్వినియోగించుకన్నారని, మిగతావారు ఈ నెల 31 శుక్రవారం వరకు గడువు ఉందని తప్పకుండ చేయించుకోవాలని కోరారు. అలాగే సిర్గాపూర్ మండల పరిధిలో ఉపాధి కూలీలు ఆధార్ ఈ కేవైసీ చేయించుకొని వారు ఎవరైనా ఉంటే తమ తమ గ్రామ పంచాయతీ వద్దకు వచ్చి చేయించుకోవాలని, లేకుంటే ఉపాధి హామీ పథకానికి అనర్హులని అన్నారు. చేయించుకొనివారు శుక్రవారం చివరి రోజు కాబ్బట్టి అందరు సద్వినియోగించుకోవాలని ఏపివో బస్వరాజ్ కోరారు.