30-10-2025 10:26:11 PM
కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): బ్యాంకుల్లో రాజకీయ జోక్యం ఉండదని తమ ప్యానల్ కి అందరి మద్దతుతో గెలుస్తున్నామని కరీంనగర్ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ ధీమా వ్యక్తం చేశారు గురువారం కరీంనగర్ లోని ప్రవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకు పాలకవర్గ ఎన్నికలు రాజకీయ జోక్యంతో జరగవున్నారు. బ్యాంకు సభ్యుల తో స్వచ్ఛందంగా తాను కరీంనగర్ అర్బన్ సహకార బ్యాంక్ చైర్మన్ బాధ్యతల్లో ఉన్నప్పుడు బ్యాంకు అభివృద్ధికి చేయడం జరిగిందన్నారు. ఆ పనితీరే బ్యాంకు సభ్యులు భారీ మెజారిటీతో తమను తమ ప్యానల్ సభ్యులను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 2004లో 24 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉండేవని ఆ తర్వాత వాటిని అధికంగా డిపాజిట్లను పెంచే విధంగా పని చేశామన్నారు.
పది సంవత్సరాలుగా బ్యాంకు అభివృద్ధి చాలా విధాలుగా ఉంటూ పడిందని పాలకుల నిర్లక్ష్యం వల్లనే బ్యాంకు అభివృద్ధి కాలేకపోయిందని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి బ్యాంకు అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని ఆరోపించారు.తమ హాయంలోనే గంగాధరలో అర్బన్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభించడం జరిగిందన్నారు. తమతో బ్యాంక్ సీనియర్ సభ్యులు పనిచేశారని సీనియర్ చైర్మన్లు సలహాలు సూచనలు అందించి బ్యాంక్ అభివృద్ధికి కృషి చేశామన్నారు. ఈసారి అవకాశమిస్తే బ్యాంకు ను కార్పొరేషన్ స్థాయిలో మెరుగుపరిచి డిపాజిట్లను పెంచుతామని తెలిపారు.
కొత్త లోన్ పద్ధతిని ఏర్పాటు చేసి చిన్న మధ్యతరగతి వ్యాపారులకు అందుబాటులో లోన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు. రికవరీ రేటు పెంచుతామన్నారు. హౌసింగ్ లోన్లు పెద్ద స్థాయి వరకు ఇవ్వగలమని అందుకు కృషి చేస్తామన్నారు. అర్బన్ బ్యాంక్ ఫౌండర్ చైర్మన్ ముద్దసాని కనకయ్య వారసత్వంలో ఉన్న వారందరూ తామంతా గతంలో చైర్మన్ గా పనిచేసిన బొమ్మరాతి రాజేశం, డి శంకర్,లు మాట్లాడారు. బ్యాంక్ సభ్యులు వున్నారని నవంబర్ 1న భారీ మెజారిటీ ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బరిలో ఉన్నా ప్యానల్ సభ్యులు బొమ్మరాతి సాయికృష్ణ, బండి దీపక్ ప్రశాంత్, భాశెట్టి కిషన్, వరాల జ్యోతి, వేదం శ్వేతా,తాటికొండ భాస్కర్, సరిళ్ల రతన్ రాజ్,యం డి శంయొద్ధిన్, ఏడ బోయిన శ్రీనివాస రెడ్డి, తాడ వీర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.