calender_icon.png 31 October, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది

30-10-2025 10:50:32 PM

ఎమ్మెల్యే చింత ప్రభాకర్..

సంగారెడ్డి (విజయక్రాంతి): ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని సంగారెడ్డి బిఆర్ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా షేక్‌పేట్ డివిజన్ గుల్షన్ కాలనీలో బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ, ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ కాలం గడుపుతోంది.

జూబ్లీహిల్స్ ప్రజలు తెలివిగా ఆలోచించి, మాయ మాటలకు మోసపోవద్దు అని అన్నారు. అలాగే, మాజీ సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి వర్గానికీ మేలు జరిగిందని, ప్రజలు ఆ పాలనను మళ్లీ కోరుకుంటున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ప్రజల తీర్పుతో బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ, మొయ్యద్ ఖాన్, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.