17 April, 2026 | 9:37 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

భూ కబ్జాలపై విచారణ చేపట్టిన అధికారులు

27-05-2025 05:08 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోని గంగోని కుంట, చిలక వాగు గుండ్ల చెరువు కబ్జాలపై ఇరిగేషన్ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. సర్వే నెంబర్ 24 77 లో 12 ఎకరాల 16 గుంటలు ఉండవలసిన గంగోని కుంట శిఖం భూమి ఆరు ఎకరాలు కూడా లేదని ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు సమ్మయ్య అధికారులకు వివరించారు. ఇరిగేషన్ ఏఈలు సునీత, ప్రీతి లు మోకపై విచారణ జరిపి పై అధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ... సంబంధిత అధికారులు ఎవరికి వారు విచారణ జరిపి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖల అధికారులు మోకపై ఒకేసారి సర్వే చేసి కబ్జాకు గురైన భూములను కాపాడాలని, కబ్జా చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.