17 April, 2026 | 11:12 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

వాట్సాప్ ద్వారా విద్యుత్ సమస్యలకు పరిష్కారం

27-05-2025 05:11 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను వాట్సాప్ చాట్ ద్వారా కూడా తెలపవచ్చని మహబూబాబాద్ సర్కిల్ ఎస్ఈ జె. నరేష్(Circle SE J Naresh) తెలిపారు. విద్యుత్ వినియోగదారులు తమ మొబైల్ నుండి వాట్సాప్ లో 7901628348 నంబర్ కు హాయ్ అని చాట్ చేయగానే హాయ్ అంటూ టీజీఎన్పీడీసీఎల్ కాల్ సెంటర్ కు స్వాగతం అని వచ్చి అందులో రిజిస్టర్ కంప్లైంట్, ట్రాక్ కంప్లైంట్, చాట్ విత్ ఏజెంట్ అని వస్తుందన్నారు.

అందులో రిజిస్టర్ కంప్లైంట్ ఎంటర్ చేయగానే విత్ యూనిక్ సర్వీస్ నంబర్, విత్అవుట్ యూనిక్ సర్వీస్ నంబర్, ప్రీవియస్ మెను వస్తుందని, విత్ యూనిక్ సర్వీస్ నంబర్ ఎంటర్ చేయగానే వినియోగదారుని విద్యుత్ సర్వీస్ వివరాలు వస్తాయన్నారు. సమస్య పరిష్కరించేంతవరకు ఆన్లైన్ ద్వారా సేవలు పొందవచ్చని చెప్పారు. అలాగే www.tgnpdcl.com వెబ్ సైట్ లో వాట్సాప్ ఐకాన్ కనిపిస్తుందని ఆ ఐకాన్ క్లిక్క్ చేసుకొని చాట్ చేయవచ్చని చెప్పారు. వినియోగదారునికి ఉత్తమ సేవలు అందించడంలో భాగంగా సాంకేతికతను అందిపుచ్చుకుని సత్వర  విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి వాట్సాప్ చాట్ ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు. అలాగే టోల్ ఫ్రీ నంబర్ 1912 సంప్రదించి కూడా సేవలు పొందగలరని ఎస్ ఈ కోరారు.