calender_icon.png 16 August, 2025 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దారి బురదమయం కాలినడకే శరణ్యం

16-08-2025 01:38:24 PM

ఏళ్ళు గడిచినా  మరని దుస్థితి.

చింతలమనేపల్లి, (విజయక్రాంతి): ఏళ్ళు గడిచినా ప్రభుత్వాలు మారినా పల్లెలు పల్లెలుగానే ఉన్నాయి. రోడ్డు రవాణా లేకపోవడంతో నేటికీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చింతల మనేపల్లి మండలం గూడెం గ్రామ పంచాయతి శివపెళ్లి గ్రామానికీ సరైన రోడ్డు సౌకర్యం లేక వర్షాకాలం లో బురదలో 3 కిలోమిటర్ల మేర ప్రయాణం చెయ్యాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తే  దేవుడి పై బారం వేయాల్సిందే.  ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు స్పందించి రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.