హోటళ్లు, రెస్టారెంట్లపై అధికారుల దాడులు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 22 (విజయక్రాంతి) : నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేప్టి అధికారులు దాడులు చేశారు. పలు హోటళ్లు, రెస్టారెంట్లలో నిల్వ ఉన్న, గడువు ముగిసిన ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. సోమాజిగూడలోని కృతుంగ రెస్టారెంట్, హెడ్ క్వార్టర్స్ రెస్ట్ ఓ బార్, కేఎఫ్‌సీలలో దాడులు చేశారు. ఈ సందర్భంగా కృతుంగ రెస్టారెంట్‌లో 6కేజీల గంగా గోల్డ్ పనీర్, 6 కేజీల మేతీ మలాయ్ పేస్ట్, 156 యూనిట్ల 1 లీటర్ బాటిళ్లు, నాన్ వెజ్ పేస్ట్, సరైన లేబులింగ్ లేని వంటకాలకు వినియోగించే పదార్థాలు, హెడ్ క్వార్టర్స్ రెస్ట్ ఓ బార్‌లో 50 పిజ్జాలు, రిఫ్రిజిరేటర్‌లో దాచి ఉంచి వెజ్, నాన్ వెజ్ పదార్థాలు, కేఎఫ్‌సీలో లైసెన్స్ కాపీని డిస్‌ప్లే చేయనందుకు వారిపై కేసులు నమోదు చేశారు.
ఈ హోటళ్ల నుంచి స్వీకరించిన శాంపిల్స్‌ను ల్యాబ్‌కు తరలించారు. అంతే కాకుండా, హోటళ్లు, రెస్టారెంట్ల పరిసరాలలో సరైన పరిశుభ్రంగా లేకపోవడాన్ని గమనించారు. నగరంలోఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్ల పేర్లను అధికారులు వెల్లడించారు. క్రీమ్ స్టోన్, న్యాచురల్ ఐస్ క్రీమ్, కరాచీ బేకరీ, కేఎఫ్‌సీ, రోస్టరీ కాఫీ హౌస్, రాయలసీమ రుచులు, షా గౌస్, కామత్ హోటల్, 36 డౌన్ టౌన్ బ్రూ పబ్, మా కౌ కిచెన్ అండ్ బార్, ఎయిర్ లైవ్, టాకో బెల్, అహా దక్షిణ్, సిజ్జిలింగ్ జో, ఖాన్ సాబ్, హోటల్ సుఖ్ సాగర్, జంబో కింగ్ బర్గర్స్, రత్న దీప్ స్టోర్, కృతుం గ, రెస్ట్ ఓ బార్ తదితర హోటళ్లు, రెస్టారెంట్ల పేర్లను అధికారులు వెల్లడించారు.






