21 August, 2026 | 1:49 AM

ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు

23-05-2024 04:16 AM

పటిష్టమైన పోలీసు పహారా ఏర్పాటు చేయాలి

కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 22 (విజయక్రాంతి) : జూన్ 4న జరుగబోయే లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారుల ను ఆదేశించారు. హైదరాబాద్ అబిడ్స్‌లోని జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన హైదరాబాద్ పార్లమెంట్ నియో జకవర్గంలోని గోషామహల్ అసెంబ్లీ సెగ్మెం ట్  ఏంకోర్ డాటా ఎంట్రీ(డమ్మీ) రిహార్సల్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

కౌంటింగ్ కోసం 14టేబుళ్లు ఏర్పాటు చేసి, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో లెక్కింపును పగడ్బందీగా జరుపాలని చెప్పారు. లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు భద్రతను ఏర్పాటు చేయాలని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్ గుర్తింపు కార్డు ఉన్న వారినే హాల్‌లోనికి అనుమతించాలని చెప్పారు. సమావేశంలో నోడల్ ఏఆర్వో విక్టర్, డిప్యూటీ కలెక్టర్ విద్యాదర్, తహసీల్దార్, ప్రేమ్‌కుమార్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.