26 April, 2026 | 8:28 AM

పవన్ పాడిన గీతంతో ఓజీ టీమ్ సర్‌ప్రైజ్!

20-09-2025 12:29 AM

పవన్‌కల్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓజీ’. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్.. ఓజాస్ గంభీరగా అలరించనున్నారు. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహ న్, ప్రకాశ్‌రాజ్, శ్రియారెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ను 22న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

అయితే, అంతకన్నా ముందే మెగా సర్ర్పైజ్ ఇచ్చింది టీమ్. సినిమాలో పవన్ స్వయంగా పాడిన ‘వాషి యో వాషి’ అనే ప్రత్యేక గీతాన్ని తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ సర్‌ప్రైజ్‌తో పవన్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది. ‘వాషి యో వాషి’ అంటూ సోషల్‌మీడియాను హీటెక్కిస్తున్నారు.  తమన్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన గీతాలన్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజా గీతం వాటిని మించేలా ఉంది. ఈ చిత్రానికి డీవోపీ: రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస; కూర్పు: నవీన్ నూలి.