20-09-2025 12:28:28 AM
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. హైదరాబాద్‌లో ఓ వాణిజ్య ప్రకటన చిత్రీకరణలో పాల్గొన్న ఆయన కాలికి స్వల్ప గాయమైంది. యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్న క్రమంలో ఎన్టీఆర్ కిందపడిపోవటంతో గాయపడ్డారు. వ్యక్తిగత సిబ్బంది సమీప ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఎన్టీఆర్ టీమ్ ఓ ప్రకటన చేసింది.
ఎన్టీఆర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిమానులను కోరారు. పూర్తిగా కోలుకోవడానికి రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. టైటిల్ ‘డ్రాగన్’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రమాదం నేపథ్యంలో షూటింగ్ వాయిదా వేసుకోవడం అనివార్యమైంది.