20-09-2025 12:31:44 AM
2022లో విడుదలైన ‘కాంతార’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. పాన్-ఇండియా స్థాయిలో భారీగా విజయం సాధించి, హోంబలే ఫిలింస్‌కి గొప్ప మైలురాయి చిత్రమైంది. ఇప్పుడీ సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోంది ‘కాంతార: చాప్టర్1’. రిషబ్ శెట్టి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదట్నుంచే భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ మూవీ ట్రైలర్ ఈ నెల 22న విడుదల కానుంది.
ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పంచుకున్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. అజనీష్ లోక్‌నాథ్ సంగీత సారథ్యం వహిస్తుండగా, అర్వింద్ కాశ్యప్ డీవోపీగా పనిచేస్తున్నారు.