అమెరికాలో తీన్మార్ మల్లన్న
టీటీజీఏ ఆధ్వర్యంలో నేడు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): అమెరికాలోని తెలుగు తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ (టీటీజీఏ) ఆధ్వర్యంలో టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హార్మొనీ డిస్ట్రి క్ట్, మొర్రిస్‌విల్లేలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం 7 గంటలకు నిర్వహించనున్నారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశముందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు మల్లన్నను ప్రత్యక్షంగా కలుసుకుని, ఆయన అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకునే అవకాశం కలుగనుంది. సామాజిక న్యాయం, రాజకీయ పరిస్థితులు, తెలంగాణకు సంబంధించిన ప్రస్తుత అంశాలపై చర్చలు జరగనున్నాయి. విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలతో మల్లన్న పరస్పర మేళవింపును పెంచే వేదికగా ఈ కార్యక్రమం నిలవనుందని టీటీజీఏ ప్రతినిధులు పేర్కొన్నారు.






