22 June, 2026 | 2:58 AM

నాడు కళకళ.. నేడు వెలవెల

22-06-2026 12:00 AM

చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ 

బోయినపల్లి: జూన్ 21 (విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ శ్రీ రాజరాజేశ్వర జలాశయం టిఆర్‌ఎస్ ప్రభుత్వం లో నీటితో కలకలలాడి నేడు కాంగ్రెస్ ప్రభుత్వం లో వెలవెలబోతుంది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం లో ప్రాజెక్టులన్ని సముద్రంల నీటితో కల కల లాడి , ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లో ప్రాజెక్టులన్ని నీళ్లు లేక ఎండిపోయి రైతులకు కన్నీళ్ళని ఇస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదివారం బోయినపల్లి మండలం శ్రీ రాజరాజేశ్వర జిల్లా టిఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నీళ్లు లేని ప్రాజెక్టులో కబడ్డీ క్రికెట్ ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు సాగునీరు ఇవ్వలేని ప్రభుత్వం రాష్ట్రంలో ఉండి కూడా ప్రయాణం లేదని ఆరోపించారు. రైతులకు ఇప్పటికే  కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఏమిటో అర్థమైందని ఆయన అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, ప్రధాన కార్యదర్శి గంటి శంకర్, కాంగ్రెస్ నాయకులు రవీందర్, దామోదర్, మండల నాయకులు ఉన్నారు.