calender_icon.png 8 May, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిభ ఉన్న విద్యార్థినికి ఎమ్మెల్యే ప్రోత్సాహం

07-05-2025 12:00:00 AM

లండన్ వెళ్లేందుకు విమాన టికెట్ అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి

కరీంనగర్, మే 6 (విజయక్రాంతి): ప్రతిభ ఉన్న  విద్యార్థులను ప్రోత్సహించి అండగా నిలవడంలో   ముందుంటారని మరోసారి నిరూపించుకున్నారు  చొప్పదండి  ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన  గడ్డం శతాక్షి కి లండన్ లోని  గ్రీన్ వి యూనివర్సిటీలో  ఉన్నత చదువులు చదవడానికి అవకాశం  వచ్చింది.

విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శతాక్షికి  ఆర్థిక సహకారం అందజేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మంగళవారం కరీంనగర్ లోని  తన నివాసంలో  శతాక్షిని అభినందించి, స్వంత ఖర్చులతో  కొనుగోలు చేసిన రూ. 70 విలువైన విమాన టికెట్ ను అందజేశారు.

ఖండాంతరాలు దాటి  చదివి, నిర్మాత అంబేద్కర్ వలె భారతదేశానికి  ఖ్యాతిని తీసుకురావాలని విద్యార్థినికి ఎమ్మెల్యే సూచించారు. విమాన టికెట్ను అందజేసిన  ఎమ్మెల్యేకు  శతాక్షీ కృతజ్ఞతలు తెలిపారు.