calender_icon.png 11 November, 2025 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్

28-01-2025 12:46:35 AM

* ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు

న్యూఢిల్లీ, జనవరి 27: ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. పది నెలలుగా పిటిషనర్ జైలులో ఉన్నాడని, ఇంకా జైల్లోనే ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. ‘తిరుపతన్న ట్రయల్‌కు పూర్తిగా సహకరించాలి.

సాక్షులను ప్రభావితం చేసినా, కేసులో ఆధారాలను దెబ్బతీసేందుకు యత్నించినా స్టేట్ గవర్నమెంట్ బెయిల్ రద్దు కోసం కోర్టును సంప్రదించవచ్చు. పాస్‌పోర్ట్ రద్దు సహా ఇతర బెయిల్ షరతులు అన్నింటినీ ట్రయల్ కోర్టు ఇస్తుంది’ అని సుప్రీంకోర్టు తెలిపింది. అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది లూథ్రా వాదనలు వినిపించారు.

ఫోన్ ట్యాపింగ్‌లో తిరుపతన్నే ప్రధాన నిందితుడని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ వ్యవహారంలో ఆయన పాత్రను తేల్చేందుకు ఇంకా 4 నెలలు పడుతుందన్నారు. మరికొంతమంది కీలక సాక్షులను విచారించాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని కోరారు.