04-10-2025 08:27:33 PM
చండూరు/నాంపల్లి (విజయక్రాంతి): రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఒకరు మృతి చెంది ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శనివారం నాంపల్లి ఎస్సై కె. లింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని తుంగపాడు గౌరారానికి జిల్లా సాయిలు(65) నాంపల్లి మండల కేంద్రానికి వెళుతుండగా మార్గం మధ్యలో గ్రామానికి చెందిన గుణగోని సాయిలు పల్సర్ బైక్ లిఫ్ట్ అడిగి ఎక్కి వెళ్తుండగా వడ్డేపల్లి మూలమలుపు వద్ద నాంపల్లి నుండి ఎదురెదురుగా వస్తున్న మరో బైకులు బలంగా ఢీకొట్టాయి. బైకుపై వెనుక కూర్చున్న జిల్లా సాయిలు అక్కడికక్కడే మృతిచెందగా మిగిలిన ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన వారిని స్థానికులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. మృతుడు సాయిలుకు నలుగురు కుమారులు భార్య ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై లింగారెడ్డి కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండకు తరలించారు.