calender_icon.png 4 October, 2025 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి

04-10-2025 08:23:31 PM

మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

భూత్పూర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని అన్నాసాగర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నివాస గృహంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గ్రామ, మండల స్థాయిలో మన వాయిస్ వినిపించాలంటే స్థానిక ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించే విధంగా టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసే అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. మన గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. గ్రామంలో గడపగడప తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించాలన్నారు.