3 April, 2026 | 1:56 AM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

03-04-2026 12:07 AM

చిట్యాల, ఏప్రిల్ 2 : జాతీయ రహదారి 65 పై నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయిన సంఘటన గురువారం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామానికి చెందిన ఊట్కూరి శ్రావణ్ కుమార్(23) మరియు అతని స్నేహితుడు భీమనపల్లి యాదగిరి( 33) వృత్తి డ్రైవర్ తక్కెళ్ళపాడు గ్రామం శాలిగౌరారం మండలం ఇద్దరు కలిసి అశోక లేలాండ్ వాహనంలో నార్కట్ పల్లి నందు డెకరేషన్ వస్తువులను లోడ్ చేసుకొని తిరిగి తక్కెళ్ళపాడు గ్రామానికి వెళుతూ మార్గమధ్యలో ఏపీ లింగోటం గ్రామ శివారులోని బ్రిడ్జి మీదగా వెళుతుండగా ఆ సమయంలో సూర్యాపేట వైపు వెళుతున్న టీఎస్ 36టి 6499 నెంబర్ గల లారీ డ్రైవర్ తన లారీని నిర్లక్ష్యంగా ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వకుండా రోడ్డుపై ఆపగా లారీ వెనుక నుండి వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం నడుపుతున్న భీమనపల్లి యాదగిరి తన వాహనమును బ్రేక్ వేసి కంట్రోల్ చేసిన కంట్రోల్ కాకుండా లారీ వెనుక నుండి ఢీకొట్టగా భీమనపల్లి యాదగిరికి తీవ్రమైన గాయాలు కాగా, పక్కన కూర్చున్న ఊట్కూరి శ్రావణ్ కుమార్ కు బలమైన రక్తపు గాయాలయి అక్కడికక్కడనే మృతి చెందాడని మృతుని తండ్రి ఊట్కూరి లింగయ్య ఫిర్యాదు చేయగా నార్కట్ పల్లి ఎస్‌ఐ పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.