ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు గ్రామ సభలు
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
మెదక్, ఏప్రిల్ 2 (విజయ క్రాంతి) : ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2న రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు ప్రారంభమయ్యాయి. గురువారం మెదక్ పట్టణంలోని దయరా 16, 17 వార్డుల్లో వార్డు సభల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం మెదక్ మండలం ముత్తాయికోట, హవేలీ ఘనపూర్ మండలం నిర్వహించిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ.. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకే గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు. తెలిపారు.
గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక సందర్భంగా గత రెండు సంవత్సరాలలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్దిని ప్రజలకు వివరిస్తూ ప్రజల సమస్యలను తీర్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు. మున్సిపాలిటీలతో పాటు గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మించామని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంస్థలను, సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్, సన్న బియ్యం, తదితర పథకాలను 6 గ్యారంటీలను అమలు చేస్తున్నదని తెలిపారు. ఇంకా చాలామంది అర్హులైన వారికి రేషన్ కార్డులు రావాల్సి ఉందని, వాటిని కూడా ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.
అంతకుముందు గ్రామలలో సర్పంచ్లు, మున్సిపాలి లలో మున్సిపల్ కమిషనర్లు అధ్యక్షతన గ్రామసభను,మున్సిపల్ వార్డు ప్రారంభించి రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, వైస్ చైర్మన్ నరేష్, వార్డు మెంబర్లు, గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, తదితరులు హాజరయ్యారు.




