20 May, 2026 | 2:35 PM

ఒక జిల్లా.. 5 ఎంపీ స్థానాలు

21-04-2024 01:23 AM

l రంగారెడ్డి జిల్లానే ఇందుకు వేదిక

l జిల్లా పరిధిలో చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ సీట్లు

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): సాధారణంగా ఒక జిల్లాలో ఒక టి లేదా రెండు అంతకంటే ఎక్కువ అంటే మూడు ఎంపీ సీట్లు ఉంటా యి. కానీ ఒకే జిల్లా పరిధిలో 5 ఎంపీ స్థానాలు ఏమిటా? అని ఆశ్చర్యపోతున్నారా? అవును ఇది నిజమే. అదెక్కడో కాదు.. మన రాష్ట్రంలోనే. రంగారెడ్డి జిల్లా 5 ఎంపీ స్థానాలకు వేదికగా ఉన్నది. జిల్లాల విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన రంగారెడ్డి జిల్లా పరిధిలోకి 5 ఎంపీ స్థానాలు వచ్చాయి.

రాష్ట్ర రాజధాని చుట్టూ ఉన్న ఈ జిల్లా పరిధిలో ప్రస్తుతం చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు అసెం బ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో ఉన్నది. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, కంటోన్మెంట్, ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానాలు ఉన్నా యి. ఇందులో ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది.

భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలో ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, జనగామ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది. నాగర్‌కర్నూలు పార్లమెంట్ స్థానంలో వనపర్తి, గద్వాల,  అలంపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఇందులో కల్వకుర్తి నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కొడంగల్ వికారాబాద్ జిల్లా పరిధిలో ఉండగా.. నారాయణపేట, మక్తల్ నారాయణపేట జిల్లా పరిధిలో ఉండగా, మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ఉండగా.. షాద్‌నగర్ మాత్రం రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చి చేరింది. ఇలా ఒక్క జిల్లా పరిధిలో 5 పార్లమెంట్ స్థానాలు ఉండటం విశేషంగా చెప్పవచ్చు.