గ్రూప్స్ కు ఓకే పరీక్ష
- ప్రభుత్వ పరిశీలనలో పతిపాదన
- సాధ్యాసాధ్యాలపై యోచన
- గ్రూప్స్‌లో సంస్కరణకు ప్రయత్నాలు
హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): గ్రూప్స్ పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోం ది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సివిల్స్, ఇతర కేంద్ర సర్వీ సు, రైల్వే, బ్యాంక్ ఉద్యోగాల భర్తీ విషయంలో అమలు చేస్తు న్న విధానాలను పరిశీలిస్తోంది. కేంద్రం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆ విధానాలను ఇక్కడ అమలు చేయాలని యోచిస్తోంది.గ్రూప్ పరీక్షలకు కలిపి ఒకే పరీక్షను నిర్వహిస్తే ఎలా ఉంటుందనే సమాలోచనలు చేస్తోంది.
ఒకే ఉమ్మడి పరీక్ష సాధ్యాసాధ్యాలపై సర్కారు ఆరా తీస్తోంది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉంది. దీనిపై మేధావులు, న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకొని చర్చించే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఎలాంటి చట్ట పరమైన చిక్కులు తలెత్తకుండా, ఉద్యోగార్థులకు నష్టం జరగకుండా ఉండేలా లోతుగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం దీనిపై సానుకూలంగానే ఉన్నట్లు ప్రభుత్వంలోని ఓ కీలక వ్యక్తి తెలిపారు.
ప్రస్తుతం వేర్వేరుగానే పరీక్షలు..
ప్రస్తుతం గ్రూప్ 2,3,4 పరీక్షలు రాష్ట్రంలో వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగాలను ఒకే క్యాడర్ కింద తీసుకొచ్చి భర్తీ చేస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వ పెద్దలు యోచి స్తున్నారు. గ్రూప్స్ పరీక్షలను టీజీపీఎస్సీ నిర్వహిస్తోంది. ఖాళీలను బట్టి వేర్వేరుగా నోటిఫికేషన్లను, పరీక్షల నిర్వహణ, నియామక ప్రక్రియను చేపడుతోంది. ఇప్పటికే గ్రూప్ పరీక్షను నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేశారు. గ్రూప్ ప్రిలిమ్స్ పరీక్షను ఇప్పటికే నిర్వహించి మెయిన్స్ను అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు.
గ్రూప్ డిసెబంర్ 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇక గ్రూప్ నవంబర్‌లో నిర్వహించనున్నట్లు జాబ్ క్యాలె ండర్‌లో పొందుపర్చారు. వచ్చే ఏడాదిలోనూ గ్రూప్స్ నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అయితే ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్లకు ఒకే పరీక్ష సాధ్యంకాదు. రాబోయే నోటిఫికేషన్ల నుంచి దీన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందని యోచి స్తుట్లు తెలుస్తోంది. అయితే నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.
పోస్టులన్నీ ఒకే క్యాడర్ కింద!
గ్రూప్స్‌లో వివిధ రకాల పోస్టులుంటాయి. క్లరికల్ క్యాడ ర్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకూ పోస్టులుంటాయి. గ్రూప్ వస్తే భవిష్యత్తులో కన్ఫర్డ్ ఐఏఎస్ కూడా కావొచ్చు. ఇక యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌లో ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్, గ్రూప్ గ్రూప్ పోస్టులను భర్తీ చేస్తారు. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, జాతీయ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఉమ్మడి పరీక్షను నిర్వహిస్తున్నారు. దీని ప్రకారమే ఆయా పోస్టులకు అభ్యర్థులను షార్ట్ లిస్టు చేస్తోంది. ఈ విధానాన్ని మరికొన్ని ఉద్యోగాల్లోనూ కేంద్రం అమలు చేస్తోంది.
కేంద్రం తరహాలోనే గ్రూప్ 2, 3, 4లోని పోస్టులను షార్ట్ లి స్టు చేయడం, లేకుంటే క్యాడర్‌ను భట్టి విభజించడంలాంటి అంశాలపై స్పష్టత తీసుకుం టున్నట్లు తెలిసింది. గ్రూప్స్ అన్నింటికీవి ద్యార్హతగా డిగ్రీనే ఉంది. గతంలో గ్రూప్ ఉద్యోగాలకు ఇంటర్ ఉండేది. 2022లో విద్యార్హతను మార్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2024 జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించిం ది. అందులో 20 నోటిఫికేషన్లకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం వివిధ శాఖల్లోని ఉద్యోగ నియామకాలను టీజీపీఎస్సీ, మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, టీజీ ట్రాన్స్‌కో, స్కూల్ ఎడ్యూకేషన్, తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు, సింగరేణి నియామక సంస్థలు భర్తీ చేస్తున్నాయి.
నిరుద్యోగులకు ఉపయోగమే...
- గ్రూప్స్ 2, 3, 4 పరీక్షలను వేర్వేరుగా నిర్వహించడం ద్వారా సమయం, డబ్బు వృథా అవుతుంది.
- అదే ఒకే పరీక్ష ఉంటే ప్రభుత్వానికి, నిరుద్యోగులకు సమయం ఆదా అవుతుంది.
- రిజర్వేషన్ల అమలులో ఎలాంటి మార్పు ఉండదు.ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారమే రిజర్వేషన్లు అమలవుతాయి.
- వివిధ నియామక సంస్థలు నిర్వహించే పరీక్షలన్నింటికీ వేర్వేరుగా ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
- పరీక్షలకు హాజరయ్యేందుకు ప్రతిసారి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయనక్కర్లేదు.
- నియామక పారదర్శకత పెరిగే అవకాశముంది.






