సైబర్ నేరాలపై అప్రమత్తం కావాలి
19-06-2026 12:00 AM
పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ శ్రీనివాస రావు
రామయంపేట, జూన్ 18: నేరాలు అరికట్టేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు గస్తీ ముమ్మరం చేయాలని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు సూచించారు. రామాయంపేట పోలీస్ స్టేషన్ ను గురువారం ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ రికార్డులు తనిఖీ చేసిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం మాట్లాడుతూ రాత్రి వేళల్లో పోలీసు గస్తీ పెంచాలని సిఐ సైదా,ఎస్త్స్ర బాల్రాజ్ లను ఆదేశించారు. దొంగతనాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసుల పనితీరు మెరుగ్గా ఉంటే నేరాలు ఫోటోలు దగ్గు ముఖం పట్టే అవకాశం ఉంటుందన్నారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచాలని సూచించారు.






