6 August, 2026 | 2:32 AM

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

06-08-2026 12:02 AM

ఎసీఐ సుధీర్ కుమార్

జిన్నారం/అమీన్‌పూర్, ఆగస్టు 5  (విజయక్రాంతి): ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో టీజీ మోడల్ కళాశాలలో సురక్షా తిరంగా సైబర్ క్రైమ్, విద్యార్థులకు  అవగాహన ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలు, వాటి నుంచి రక్షణ పొందే మార్గాలపై పోలీసులు అవగాహన కల్పించినట్లు సీఐ సుధీర్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా ఆన్లైన్ గేమ్స్కు బానిస కాకూడదని, అపరిచితులు పంపే ఏపీకే ఫైళ్లు, అనుమానాస్పద లింకులు, క్యూఆర్ కోడ్లు క్లిక్ చేయకూడదని సూచించారు.

ఇలాంటి చర్యల వల్ల మొబైల్ ఫోన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని వివరించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్త్స్ర అక్షిత, ఎస్త్స్ర కిష్టా రెడ్డి పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్  శ్రీదేవి కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.