calender_icon.png 7 November, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు

07-11-2025 10:03:02 PM

నూతనకల్,(విజయక్రాంతి): గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా  మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన శుక్రవారం రాత్రి మండల పరిధిలోని ఎర్ర పహాడ్ క్రాస్ రోడ్ లో గల జాతీయ రహదారిపై జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెదనెమిల గ్రామానికి చెందిన మృతుడు కాసోజు మురళి, జంగం లాజర్లు మద్దిరాల రోడ్డు నుండి ద్విచక్ర వాహనంపై పెదనెమిల వెళ్తుండగా ఎర్రపాడు క్రాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో కాసోజు మురళి జంగం లాజర్ కు తీవ్ర గాయాలు కావడంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు మురళి అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మురళి మృతి చెందడంతో  గ్రామంలో  విషాదఛాయలు అలుముకున్నాయి.