26-07-2025 11:55:45 PM
యువ వికాస్ సదస్సులో నటుడు నిర్మాత ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ బెల్లి జనార్ధన్..
నకిరేకల్ (విజయక్రాంతి): విద్యార్థులు చిన్ననాటి నుండే ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని నటుడు నిర్మాత ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ బెల్లి జనార్ధన్ సూచించారు. నకిరేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ట్రస్మా సహకారంతో శనివారం స్థానిక శకుంతల ఫంక్షన్ హాల్ లో జరిగిన యువ వికాస్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అపజయాలు విజయానికి సోపానాలని వివరించారు. యువత విద్యార్థులు డ్రగ్స్ మద్యం ధూమపానం లాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మెలగాలన్నారు. దానివల్ల కలిగే నష్టాలు ఎల్ఈడి స్క్రీన్ పై విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు వివరించారు. తల్లిదండ్రుల ఆశయాలను వమ్ము చేయకుండా చిన్ననాటి నుండే కష్టపడి భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకోవాలని చెప్పారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేపాల సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్మా అధ్యక్షుడు ఎర్ర శంభు లింగారెడ్డి ప్రోగ్రాం చైర్మన్ గా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ వై మోహన్ రెడ్డి రీజియన్ చైర్మన్ సంతోష్ కుమార్ జోన్ చైర్మన్ బుడిగె శ్రీనివాసులు క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్రావు మండల విద్యాధికారి నాగయ్య ట్రస్ట్ కార్యదర్శి ఎల్లపు రెడ్డి యాదగిరి రెడ్డి క్లబ్ కార్యదర్శి సూర్యచంద్రరావు క్లబ్ ప్రతినిధులు గుర్రం అంతయ్య దైద రవీందర్ వరకాంతం నారాయణరెడ్డి సామంతపురి మురళి ఉప్పల సంతోష్ ట్రస్మా మండల కార్యదర్శి కన్నయ్య గౌడ్ పట్టణంలోని వివిధ పాఠశాల చెందిన కరస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు యువ వికాస్ సదస్సుకు సుమారు 2000 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు కార్గిల్ విజయ్ దివాస్ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాజీ ఆర్మీ లు బెల్లి జనార్ధన్ కొమ్ము కోటేష్ లను ఈ సందర్భంగా సన్మానించారు.