27-07-2025 12:00:00 AM
హుస్సేన్ సాగర్‌కు పెరిగిన వరద
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 26 (విజయక్రాంతి): గత కొన్ని రో జులుగా హైదరాబాద్‌ను ఎడతెరిపి లేని వర్షాలు ముంచెత్తుతున్నా యి. శుక్రవారం ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురుస్తోంది. బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్, ప్యాట్నీ, ప్యారడైజ్, మారేడు పల్లి, చి లకలగూడ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.
మాసబ్‌ట్యాంక్ స మీపంలో రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో వాహనాలు నెమ్మదిగా క దులుతూ ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతున్నాయి. భారీ వర్షాలతో హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మా రింది. నీటి సా మర్థ్యం 514.75 మీ టర్లుకాగా, ప్ర సుతం 513.25 మీటర్లకు చేరింది. అధికారులు పరిస్థితి సమీక్షించి, సాగర్ ౪ తూము గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చే శారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అ ప్రమత్తంగా ఉండాలన్నారు.