calender_icon.png 16 December, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యతోపాటు అన్ని రంగాలలో పాల్గొనాలి

16-12-2025 01:35:46 AM

మొయినాబాద్, డిసెంబర్ 15 (విజయ క్రాంతి): విద్యార్థులు ఉన్నత విద్యతోపాటు జాతీయస్థాయి కార్యక్రమాలలో పాల్గొనడం అభినందనీయమని సికింద్రాబాద్ రైజింగ్ కమాండింగ్ అధికారి కాల్నాల్ .. సుబేదార్ మేజర్ రాజు కుమార్ లు.అన్నారు. సోమవారం మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని చిలుకూరు రెవెన్యూ పరిధిలో గల గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి ఎన్సీసీ ఆర్మీ యూనిట్ స్థాపన కార్యక్రమాన్ని కళాశాల డైరెక్టర్ కె.ఎం. పాసిరుద్దీన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాల్నాల్ పాల్గొని ఆయన ఎన్సీసీ జెండాను ఆవిష్కరించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్ ఇంజనీరింగ్ విద్యా సంస్థకు ఎన్సీసీ ఆర్మీ గుర్తింపు రావడం ఎంతో అభినందనీయమని తెలిపారు. జాతీయస్థాయి కార్యక్రమాలు విద్యార్థులు నిర్వహించినప్పుడే ఆ కళాశాలలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తుందని తెలిపారు. విద్యార్థులు నాయకత్వ లక్షణాలతో పాటు నైపుణ్యాలను క్రమశిక్షణ జట్టు కృషి ఎంతో అవసరం అన్నారు.

సామాజిక సేవలు జాతీయ బాధ్యత బలమైన భావాన్ని పెంపొందించుకోవడానికి విలువైన అవకాశాలు ఉంటాయని సూచించారు. కళాశాల కార్యదర్శి సబియా ఫర్జానా మాట్లాడుతూ.. విద్యార్థుల అభివృద్ధి గ్లోబుల్ ఇంజనీరింగ్ కళాశాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

విద్యార్థులకు అన్ని విధాలుగా నాణ్యమైన విద్యతో పాటు ఉన్నత విద్యనందిస్తూ.. వారి భవిష్యత్తు కోసం జాతీయ సేవా కార్యక్రమాలలో పాలుపంచుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆర్మీ ఎన్సీసీ కళాశాలకు గుర్తింపు పొందడం ఎంతో గర్వకారణంగా ఉందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పసియోద్దీన్,రవీంద్ర తివారి, ఎన్సీసీ విద్యార్థులు ఆధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు..