05-11-2025 07:19:44 PM
భగవాన్ నామస్మరణ చేస్తూ సన్మార్గంలో నడవాలి..
ఇంద్రవెల్లి (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ భగవాన్ నామస్మరణ చేస్తూ సన్మార్గంలో నడవాలని నారాయణ మహారాజ్ ఉద్బోధించారు. బుధవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని శాస్త్రీనగర్ హనుమాన్ ఆలయంలో కార్తీకమాస కాకడ హారతి సత్సంగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణ మహారాజ్, రాంసింగ్ మహారాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రవచనాలను బోధించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దని, దైవచింతనను అనుసరించాలన్నారు. భారతదేశం భిన్న సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ.. భావితరాలకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డోంగ్రే మారుతి, బాలాజీ, సంజీవ్ చామంతవార్, లక్ష్మణ్,సూర్యకాంత్ కేంద్రే, దూట రాహుల్, ఫడ్ విశ్వనాథ్, సంతోష్, సూర్యవంశీ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.