calender_icon.png 5 November, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోథ్ మార్కెట్ యార్డ్ ను తనిఖీ చేసిన మార్క్ ఫెడ్ డి.ఎం

05-11-2025 07:22:38 PM

బోథ్ (విజయక్రాంతి): బోథ్ మార్కెట్ యార్డ్ ను బుధవారం మార్క్ ఫెడ్ డి.ఎం ప్రవీణ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మొక్కజొన్న, సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఆయా పంటల తేమ శాతాన్ని పర్యవేక్షించారు. నిబంధనల ప్రకారం రైతులు పంటలను మార్కెట్ యార్డ్ కు తీసుకురావాలని సూచించారు. పంటలను శుభ్రపరచి ఆరబెట్టి తీసుకురావాలని పేర్కొన్నారు. ఆయన వెంట పిఎసిఎస్ చైర్మన్ కధం ప్రశాంత్, సీఈఓ లు గోలి స్వామి, బారే భూషణ్, పలువురు రైతులు ఉన్నారు.