calender_icon.png 20 January, 2026 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవిష్యత్తు తరాలకు తెలిపేవి మన సంప్రదాయాలు

20-01-2026 12:00:00 AM

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్

ముషీరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): సాంస్కృతిక కార్యక్రమాలు మన సంస్కృతి వారసత్వాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు దోహదపడతాయని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. పంజాబీ సేవా సమితి 27వ ‘లోహ్రీ సగన’ వేడుకలు సికింద్రాబాద్ లోని తివోలి గార్డెన్స్ ఘనంగా జరిగాయి. అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు, పంజాబీ సమాజం సభ్యులతో ఉత్సాహభరితంగా సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ హాజరయ్యారు.

సాంప్రదాయ భోగి మంటలను ముఖ్యఅతిథితో పాటు పంజాబీ సేవా సమితి ప్యాట్రన్స్ రవి ఓహ్రీ, డిఎన్. గౌరీ, ప్రేమ్ కపూర్, రమేష్ పాసి, పంజాబీ సేవా సమితి అధ్యక్షుడు దీపక్ కుమార్ జైరత్, పూర్వ అధ్యక్షులు పాల్ శర్మ, యోగేష్ సర్పాల్, పర్దీప్ లూంబా, సునీల్ పూరి, ఉమేష్ థక్రాల్, ఉపాధ్యక్షులు జగ్మోహన్ సచ్దేవా, నవీన్ పాసి, అనూప్ ఫాకే, రోమి అరోరా, కోశాధికారి యోగేష్ సర్పాల్, జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గనోత్రా, జాయింట్ సెక్రటరీ అమిత్ ఖర్బందా, అడ్వైజరీ కమిటీ సభ్యుడు ముఖేష్ అరోరా తదితరులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంజాబీ సేవా సమితి ఎగ్జిక్యూటివ్ సభ్యులు గుల్షన్ పస్రిజా, రమేష్ తనేజా, నితిన్ టాండన్, విశాల్ భాటియా, జైపాల్ ఖురానా, మహిళా విభాగం సభ్యులు ప్రీతా అరోరా, శ్రీమతి నందా మల్హోత్రా, రష్మి ఖన్నా, మెహ్రా, షైలీ కపూర్, రచిత్ పూరి, సమితిలోని ప్రముఖులు పాల్గొన్నారు.