09-01-2026 12:00:00 AM
జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి
బాలానగర్, జనవరి 8: ప్రతి వ్యక్తి జీవితంలో మార్పు రావాలంటే మంచి చదువుతోనే సాధ్యమవుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. మండలంలోని పెద్దాయపల్లి సమీపంలో రూ 200 కోట్ల నిధులతో మెగా కంపెనీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఏడాది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని గుర్తు చేశారు.
రెండేళ్ల కాలం లోపే ఈ భవన నిర్మాణాన్ని పూర్తిచేసి నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరు బాగా చదివి వారి కుటుంబాలకు భరోసానిచ్చేలా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ఉన్నారు.