calender_icon.png 1 May, 2025 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పైసలు ఇస్తేనే.. ఫైల్ ముందుకు... లేదంటే నెలలు ఆగాల్సిందే

12-04-2025 12:34:46 AM

నారాయణపేట, ఏప్రిల్ ౧౧ (విజయక్రాంతి): నారాయణపేట జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాధికారి కార్యాలయంలో కొంతమంది ఉద్యోగులు పైసలు ఇస్తేనే ఫైలు ముందుకు లేదంటే  నెలల తరబడి ఆగాల్సిందే వివరాల్లోకివెళితే నారాయణ పేట జిల్లా విద్యాధికారి కార్యాలయంలో జిల్లాలోని కొంత మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయగా వారు బిల్లులకోసం జిల్లా విద్యాధి కారి కార్యాలయంలో యూసీలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది .

ఇలా సబ్మిట్ చేయగానే విద్యాధికారి కార్యాలయం నుండి హైదరాబాద్ లోని ఆర్జేడీ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. ఇలా పంపకుండా కొంతమంది ఉద్యోగులు లంచాలకు ఆశప డి ఈ క్రమంలో ప్రవేట్ పాఠశాలల అనుమతులు, రెన్యువల్, కోసం వచ్చే వారితో డబ్బులు ఇవ్వనిదే ఫైలు ముందుకు పంపకుండా కార్యాలయంలోనే నాన్చుతూ ఈరోజు రేపు పంపుతామని వారికి చుక్కలు చూపిస్తున్నారని పేరు చెప్పటానికి ఇష్టపడని ఓ పదవీ విరమణ చేసిన ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా ఇదే విషయమై కార్యాలయ సూపరింటెండెంట్ నరసింహ రెడ్డి నీ వివరణ కోరగా.. ఏది ఏమైనా ఈవిషయం నావరకు రాలేదని ఏమైనా ఉంటే త్వరగా ఫైళ్లు ముందు కు పంపిస్తామని తెలిపారు. ఇదే విషయమై కొంతమంది ఉద్యోగులపై ఏసీబీ అధికారులను సంప్రదిం చినట్లు కూడా తెలుస్తుంది ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ విచారణ జరిపి సంబంధితసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.