calender_icon.png 24 October, 2025 | 1:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాపన్నపేట పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్..

22-10-2025 04:38:48 PM

విద్యార్థులకు వివరంగా వివరించిన ఎస్సై శ్రీనివాస్ గౌడ్

పాపన్నపేట (విజయక్రాంతి): మండల కేంద్రమైన పాపన్నపేట పోలీస్ స్టేషన్ లో పోలీసులు నిర్వహిస్తున్న విధులపై పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ మేరకు ఓపెన్ హౌస్ లో భాగంగా పాపన్నపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు పోలీస్ స్టేషన్ కు వెళ్లగా విద్యార్థులకు పోలీసుల విధులపై అవగాహన కల్పించారు. రిసెప్షన్ సెంటర్, ఎస్సై గది, రైటర్ గది, లాకప్ తో పాటు పోలీసులు వాడే ఆయుధాలపై విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. వైర్లెస్ సెట్ ఏ విధంగా వాడతారు తదితర విషయాలను వివరించడమే కాకుండా విద్యార్థులతో వైర్లెస్ సెట్ లో సంబంధిత అధికారులతో మాట్లాడించారు.

విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఎస్సై వివరించారు. పాపన్నపేట పోలీస్ స్టేషన్ లోనే స్మారక స్థూపం ఎందుకు ఏర్పాటు చేశారని విద్యార్థులు అడగగా.. 1999 సెప్టెంబర్ 13న పోలీస్ స్టేషన్ ను నక్సలైట్లు పేల్చివేసి ఐదుగురు పోలీసుల ప్రాణాలను బలిగొన్నందున స్మారక స్థూపంగా దీన్ని నిర్మించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తో పాటు పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయులు అంజా గౌడ్, రమేష్, విశ్వనాథ్, మహమూద్ తదితరులు పాల్గొన్నారు.