calender_icon.png 24 October, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్నూలు బస్సు ప్రమాదంలో ఇద్దరు సాప్ట్‌వేర్ ఇంజినీర్లు సజీవదహనం

24-10-2025 01:41:48 PM

హైదరాబాద్: హైదరాబాద్ నుంచి బెంగళూరు(Hyderabad to Bangalore) వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో బెంగళూరులో సాప్ట్‌వేర్ ఇంజినీర్లుగా(Software Engineers) పని చేస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తకొండూరుకు చెందిన అనూష రెడ్డి, ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి(27) సజీవదహనం అయ్యారు.

అనూష రెడ్డి దీపావళికి(Diwali) స్వగ్రామం వెళ్లి గురువారం రాత్రి బెంగళూరుకు బయలుదేరింది. హైదరాబాద్‌లో ఉండే మేనమామ దగ్గరికి వచ్చిన ధాత్రి అక్కడే ట్రావెల్స్ బస్సు ఎక్కింది. అనూష రెడ్డి, ధాత్రి మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో 13 మంది తెలంగాణ వాసులున్నారు. అందులో ఏడుగురు గాయాలతో బయటపడ్డారని, మిగిలిన వారి ఆచూకీ తెలియరాలేదని గద్వాల్ జిల్లా కలెక్టర్ వెల్లడించారు.  కాగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు అగ్ని ప్రమాదంలో మృతుల కుంటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.