జూబ్లీహిల్స్‌లో సావిత్రి హ్యాండ్లూమ్ బ్రాంచి ప్రారంభం
24-08-2024 12:16 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ రోడ్‌నంబర్ 10లో సావిత్రి హ్యాండ్లూమ్ వారి రెండో బ్రాంచి ప్రారంభమైంది. ప్రముఖ సింగర్ సునీత జ్యోతి బ్రాంచిని పారంభించారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ధరలతో వివాహాది శుభకార్యాలకు హ్యాండ్లూమ్ వస్త్రా లు లభిస్తాయని ఆమె తెలిపారు. ప్రొపరేటర్ దామర్ల శివప్రసాద్ మాట్లాడుతూ.. చీరా లలో తమకు ఉత్పత్తి కేంద్రం ఉన్నదని చెప్పారు. నాణ్యతతో కూడిన హ్యాండ్లూమ్ వస్త్రాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో సంఘసేవకులు చిన్న శ్రీశైలంయాదవ్, దామర్ల సాయిసుమన్, సేల్స్‌మేనేజర్లు పూర్ణచందర్‌రావు, నరసింహారావు పాల్గొన్నారు.






