calender_icon.png 24 May, 2025 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలి

24-05-2025 12:00:00 AM

ఎమ్మెల్యే కాలె యాదయ్య 

చేవెళ్ల, మే 23 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆదేశించారు. శు క్రవారం క్యాంపు కార్యాలయంలో  ఐదు మండలాల ఎంపీడీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజీవ్ వికాస్ పథకం ద్వారా ప్రయోజనాలు అందాలని ఆదేశించారు.

ఇండ్లు మంజూరైన  లబ్ధిదారులు 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇండ్లు నిర్మించుకోవాలని సూచించారు. అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని ఎంపీడీవోలకు ఆదేశించారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద జాగ్రత్తగా లబ్ధిదారుల ఎంపిక చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో లు వెంకయ్య, హిమబిందు,  సంధ్య,  అనురాధ, అపర్ణ పాల్గొన్నారు.