08-05-2025 12:13:54 AM
- జనరల్ ఆస్పత్రికి పెరుగుతున్న రోగుల సంఖ్య
- ఆపరేషన్ థియేటర్లు లేక అవస్థలు
-ఒకే థియేటర్తో వందలాది మంది రోగులకు వైద్యం
-నేటికీ పట్టించుకోని పాలకులు
నాగర్కర్నూల్, మే 7 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంగా ఏర్పాటైన నాటి నుంచి జనరల్ ఆస్పత్రిలో రోగుల తాకిడి రోజురోజుకు మరింత పెరుగుతోంది. సుమారు రోజుకు 1000 నుండి 1500 కు మంది పైగా ఔట్ పేషెంట్లు, 500 మందికి పైగా ఇన్ పేషెంట్లు వైద్యం పొందుతున్నారు.
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ ప థకం ప్రారంభించిన నాటి నుంచి గర్భిణీ స్త్రీలు ఆసుపత్రులకు క్యూకడుతూ నిరుపేద ఆడబిడ్డలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే పురుడు పోసుకొంటున్నారు. కానీ మిగతా విభాగాలు ఏవి కూడా పూర్తిస్థాయిలో అందుబా టులోకి తీసుకురాలేకపోయారు. గత పదేళ్లపాటు ఏరియా ఆసుపత్రి నుంచి జనరల్ ఆసుపత్రిగా మార్పు చెంది జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటైనప్పటికీ ఏరియా ఆసుపత్రిలో ఉండే వసతులకు మిం చి ఏర్పాటు చేయకపోవడం తో ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందలేకపోయింది.
చి వరకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీని కూడా ఏర్పాటు చేయకపో వడంతో ప్రజల నుంచి నాటి పాలకులు తీ వ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆసుపత్రి అభివృద్ధి పై చొరవ చూపకపోవడంతో రోగులు తీవ్ర నిరాశతో ఉన్నారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణలు వైద్యరంగంలో ప్రావీణ్యం పొందిన వారే అయినప్పటికీ పేద రోగులకు వైద్యం అందిం చే జనరల్ ఆస్పత్రి అభివృద్ధి కోసం శ్రద్ధ చూపడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో మంత్రిగా పనిచేస్తున్న జూపల్లి కృష్ణారావు కేవలం ఆసుపత్రి అభివృద్ధి కోసం 50 లక్షలు విరాళంగా ఇచ్చి చేతులు దులిపేస్తున్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి జనరల్ ఆస్పత్రి అభివృద్ధిపై ఏ రోజు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఫలితంగా నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రిలో కేవలం రెండు ఆపరేషన్ థియేటర్లో మాత్రమే అందుబాటులో ఉండడంతో ఒకటి గైనకాలజిస్ట్ స్త్రీ వైద్య విభాగం ఆపరేషన్ థియేటర్, సాధారణ వైద్య విభాగం, ఎముకల వైద్య విభాగం రెండు విభాగాలు చెరో మూడు రోజులు విడతలవారీగా రోగులకు వైద్యం అందిస్తున్నారు.
నిత్యం జనరల్ సర్జరీలు ఆర్తో సర్జరీలు అధికంగా వస్తున్నప్పటికీ తప్పని పరిస్థితిలో పరిమిత స్థాయిలోనే రోగులకు వైద్యం అందిస్తున్నారు. ఏదైనా ఒక రోగి వైద్యం పూర్తిగా నయమై ఇంటికి వెళ్లిన తర్వాతే ఆ స్థానంలో మరో రోగికి అవకాశం లభిస్తుంది. దీంతోపాటు కంటి వైద్య విభాగం, దంత వైద్య విభాగం, చెవి ముక్కు గొంతు వైద్య విభాగం, నరాలు మెదడు వైద్య విభాగం వంటి వాటిలో ఎలాంటి ఆపరేషన్ల వైద్యానికి ప్రజలు నోచుకోవడం లేదు.
స్త్రీల వైద్య విభాగంలో సుమారు రోజుకు 10 నుండి 20 మంది, జనరల్ సర్జరీలు, ఆర్తో సర్జరీలు నెలలో సుమారు 50 నుండి 60 మందికి పైగా ఆపరేషన్లు చేస్తున్న పరిస్థితి. ప్రతి విభాగంలోనూ హెచ్వోడీలు ఉన్నత స్థాయి నిష్ణాతులు వైద్యులు ఉన్నప్పటికీ సరైన వసతులు లేకపోవడంతో పూర్తిస్థాయిలో రోగులకు వైద్యం అందరిని ద్రాక్షగా మారింది. అయినా ప్రభుత్వ పెద్దలు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఇతర స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడంతో నాగర్ కర్నూ ల్ జనరల్ ఆసుపత్రిలో వైద్యం దయనీయంగా మారింది.