08-05-2025 12:01:20 AM
ఆర్‌ఎంసి ప్లాంట్ తో నర్కూడలో తీవ్రవాయు కాలుష్యం
రాజేంద్రనగర్, మే 7: నిబంధనలకు విరుద్ధంగా శంషాబాద్ మండల పరిధిలోని నర్కూడ గ్రామంలో కొనసాగుతున్న ఆర్‌ఎంసి ప్లాంట్ పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులు తహసిల్దార్ రవీందర్ దత్ కు నివేదిక అందజేశారు. నర్కుడపై ’కాలుష్యపు పడగ’.. ఆ తర్వాత ’నోటీసులతో సరిపెడుతున్నారు’ శీర్షికలతో విజయక్రాంతి పత్రికలతో సమగ్ర వివరాలతో కథనాలు ప్రచురితమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఎంపీడీవో మున్ని, ఇన్చార్జి ఎం పి ఓ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు నర్కూడ పంచాయతీ అధికారి వజ్రలింగం ఆర్‌ఎంసి ప్లాంట్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. నోటీసుల నిర్వహణకు ఉన్న పత్రాలను వెంటనే అందజేయాలని సూచించిన నిర్వాహకులు ఏమాత్రం స్పందించలేదు. దీంతో ఆర్‌ఎంసి ప్లాంట్ ను ఎందుకు మూసి వేయకూడదు తెలియజేయాలని కోరినా స్పందించలేదు.
ఈ నేపథ్యంలో 111 జీవో పరిధిలో ఉన్న ఆర్‌ఎంసి ప్లాంట్ పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తాజాగా బుధవారం పంచాయతీ అధికారి వజ్రలింగం శంషాబాద్ తహసిల్దార్ రవీందర్ దత్ నివేదిక అందజేశారు. రెవెన్యూ అధికారులు సత్వరమే స్పందించి తీవ్ర కాలుష్యనికి కారణమవుతున్న ఆర్‌ఎంసి ప్లాంటును మూసివేయాలని నర్కుడ గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.