08-05-2025 12:18:12 AM
కడ్తాల్, మే 7 : కడ్తాల్ మండల కేం ద్రంలో బస్టాండ్ నిర్మాణం కు అడుగులు పడడం లేదు. హైదరాబాద్ - శ్రీశైలం జాతీ య రహదారిపై ఉన్న కడ్తాల్ మండల కేం ద్రంలో బస్టాండ్ నిర్మాణం లేకపోవడంతో ప్రయాణికులు వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ నిత్యం అవస్థలు పడుతున్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాదు కు అతీ సమీపంలో ఉన్న మండల కేంద్రం కావడంతో నిత్య మండల కేంద్రం నుంచి హైదరాబాద్, శ్రీశైలం, సంగారెడ్డి, యాదగిరిగుట్ట, మహేశ్వరం, కందుకూర్, తలకొండపల్లి, ఆమన గల్, వెల్దండ కల్వకుర్తి షాద్నగర్, యాచా రం, ఇబ్రహీంపట్నం కు ప్రతినిత్యం ప్రజలంతా రాకపోకలు సాగిస్తుంటారు.
ప్రయా ణాలు సాగించే వారంతా నిత్యం రోడ్డుపై నిలుచొని ప్రయాణాలు సాగిస్తూ పలు ప్ర మాదాలకు గురైన సంఘటనలు కోకోల్లలు. ప్రయాణికుల సమస్యను గుర్తించి ప్రజా సం ఘాలు, విద్యార్థి సంఘాల నేతలు మండల కేంద్రం లో బస్టాండ్ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయినా వారిలో స్పందన కరువైం ది. మండల కేంద్రం నుంచి రాకపోకలు సా గించే ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు రోడ్డుపైనే నిలుపుతుండడంతో ట్రా ఫిక్ సమస్య లు కుడా తలెత్తుతున్నాయి.
నిత్యం మండల కేంద్రం నుంచి హైదరాబాద్, శ్రీశైలం, వరంగల్, యాదగిరిగుట్ట, షా ద్నగర్, ఇబ్రాహీంపట్నం, సంగారెడ్డి, జహీరా బాద్, హన్మకొండ, అచ్చంపేట తదితర ప్రాంతాలకు వందలాది బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ప్రయాణికు లంతా బస్టాండ్ లేకపోడం తో రోడ్ల సమీపంలో ఉన్న హోటళ్లు, వాణిజ్య దుకాణాల వద్ద తప్పనిసరి పరిస్థితుల్లో బస్సుల కోసం నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.
కనీస అవసరాలు తీర్చుకునే పరిస్థితి లేదు...
మండల కేంద్రంలో ప్రయాణాలు సా గించే ప్రయాణికుల అవస్థలు అంతా ఇం తా కాదు. కడ్తాల్ మండల కేంద్రాలను తో పాటు, వివిధ ప్రాంతాల నుంచి మండల కేంద్రాల ప్రయాణించే వారి సమస్యలు వర్ణనాతీతం. కనీస అవసరాలు, తాగునీటి సమస్యలు తీర్చుకోలేని దుస్థితిలో ప్రయాణికులు ఇబ్బందులు గురవుతున్నారు.
మం డల కేంద్రం నుంచి ఆర్టీసీకి భారీగా ఆదా యం వస్తున్న ప్రయాణికుల కనీస అవసరాలు తీర్చాలని ధ్యాసే లేకపోవడం విడ్డూ రం. ఇప్పటికైనా మండల కేంద్రంలో బస్టాం డ్ ఏర్పాటుకు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు చొరవ తీసుకొని బస్ స్టాండ్ ఏర్పాటుకు కృషిచేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా..
కడ్తాల్ మండల కేంద్రంలో బస్టాండ్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. గత ప్రభుత్వంలో సమస్య గురించి అధికారులు ప్రతినిధులకు విన్నవించిన పట్టించుకోలేదు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లి బస్టాండు నిర్మాణం కోసం తన వంతు ప్రయత్నం చేస్తా.
గూడూరు భాస్కర్ రెడ్డి, ఆమనగల్లు మార్కెట్ వైస్ చైర్మన్