కో ‘ఆప్షన్‌ల’ పై కన్ను..
ప్రతీ గ్రామపంచాయతీలో ముగ్గురు సభ్యులకు అవకాశం
జిల్లాలో 492 పంచాయతీలు
1476 మందికి అవకాశం
వార్డు సభ్యులతో సమానంగా హోదా
మెదక్, ఏప్రిల్ 1(విజయక్రాంతి): రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వం పంచాయతీలకు డిసెంబరు 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసి కొత్తపాలక వర్గాలు కొలువుదీరాయి. సర్పంచులు, ఉపసర్పంచులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించే పనిలో పడ్డారు. సర్పంచుగా, వార్డు సభ్యులుగా పోటీ చేయని రాజకీయ నేతల కన్ను కో-ఆప్షన్ పదవిపై పడింది.
కో-ఆప్షన్ గతంలో మండల పరిషత్లో, జిల్లా పరిషత్లో, మునిసిపల్ కౌన్సిల్లోనే ఉండేవి. మండల, జిల్లా పరిషత్లలో మైనార్టీలకు మాత్రమే అవకాశం ఉంటుంది. మున్సిపల్, కార్పొరేషన్లపై మైనారిటీలతో పాటు ఇతరవర్గాల సభ్యులకు కూ డా అవకాశం ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యె ఎవరిని నియమిస్తే వారికే పదవి వరించేది. పంచాయతీరాజ్-2018 నూతన చట్టం ప్రకారం పంచాయతీలలో ముగ్గురు కో-ఆప్ష న్ సభ్యులను నియమించాలని పేర్కొంది. దీ ని ప్రకారం ప్రతీ పంచాయతీలో ఈ పదవులపై అసక్తి ఏర్పడింది. ఎవరికి వారు సర్పంచులతో, మండల నాయకులు, ఎమ్మెల్యేలతో పైరవీలకు సిద్ధం అవుతున్నారు.
ఒక్కో పంచాయతీకి ముగ్గురు చొప్పున
మెదక్ జిల్లాలోని 492 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీకి ముగ్గురు కో-ఆప్షన్ సభ్యులను నియమించానున్నారు. దీంతో జిల్లాలోని 492 పంచాయతీల్లో సు మారుగా 1476 మంది కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. గ్రామ పంచాయతీల్లో కో- ఆప్షన్ సభ్యుల స్థానాల భర్తీకి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. అయినా గతంలోలాగా కో-ఆప్షన్ స భ్యులను తీసుకుంటారన్న నమ్మకంతో ఆశావహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు సాగి స్తున్నారు. గ్రామ పంచాయతీల్లో ఏపార్టీ వా రికి మెజార్టీ ఉంటే వారు ఎన్నుకున్న వారే కో- ఆప్షన్ సభ్యులవుతారు. ప్రభుత్వ ఉ త్తర్వులు వచ్చాక చూ ద్దాంలే అని ఊరుకుంటే అప్పటికే మాట ఇచ్చామంటారేమోనని ఆశావ హులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
వార్డు సభ్యులతో సమానంగా హోదా...
కో- ఆప్షన్ సభ్యులకు గ్రామసభల్లో, పం చాయతీ సమావేశాల్లో ప్రత్యేక స్థానం ఉం టుంది. వార్డు సభ్యులతో సమానంగా హో దా, ప్రొటోకాల్ కూడా ఉంటుంది. వీరు స మావేశాల్లో పాల్గొని చర్చలు, సూచనలు చేయవచ్చు. కానీ ఏదైనా తీర్మానంపై ఓటు వేసే హక్కు వీరికి ఉండదు. కేవలం సలహాదారులుగానే ఉండాల్సి ఉంటుంది. జిల్లాలో ని మేజర్ పంచాయతీల్లో కో ఆప్షన్ స భ్యుల కోసం పోటీ తీవ్రంగా ఉంది. సర్పం చ్ ఎన్నికల్లో రిజర్వేషన్, సామాజిక వర్గం కలసి రాక కొందరు, ఖర్చు చేయలేక మరి కొందరు పోటీకి దూరంగా ఉన్న వాళ్ళు కో ఆప్షన్ పదవుల ను దక్కించుకోడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలా ఎంపిక చేస్తారు..
గ్రామంలోని మహిళా సమాఖ్య సంఘం అధ్యక్షురాలిని తప్పకుండా ఎంపిక చేయాలి. గ్రామ అవసరాల రీత్యా స్థలం ఇచ్చిన దాత ను కో-ఆప్షన్ సభ్యుడిగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఏదైనా ప్రభుత్వ సర్వీసులో ఉద్యోగం చేసి పదవి విరమణ పొందిన ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ నేతలు ఎవరిని అనుకుంటే వారికి పదవి వరించే అవకాశాలు ఉన్నాయి.
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే..
పభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే గ్రామ పంచాయతీల్లో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక జరుగుతుంది. పంచాయతీ రాజ్ చట్టంలో ముగ్గురు కో ఆప్షన్ సభ్యుల ఎంపికను పొందుపర్చారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
యాదయ్య, డీపీఓ




