08-10-2025 12:35:48 AM
జిల్లా కలెక్టర్ కె.హైమావతి
సిద్ధిపేట కలెక్టరేట్,అక్టోబర్ 7:స్థానిక సం స్థల ఎన్నికలలో భాగంగా గ్రామపంచాయతీ ఎన్నికల రాండమైజేషన్ ప్రక్రియ మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మం దిరంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి కె.హైమావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్టేజ్-1లో 176 మంది అర్‌ఓలు, 176 మంది ఏఅర్‌ఓలు, స్టేజ్-2లో 608 మంది అర్‌ఓలకు రాండమైజేషన్ పూర్తయింది.స్టేట్ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్‌ఓ, ఏఅర్‌ఓల నియామకాలు జరిపినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
వీరికి నిర్ణయించిన తేదీల్లో మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ త రగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరిమా అ గ్రవాల్, అబ్దుల్ హమీద్, జెడ్పీ సిఈఓ రమే ష్, డిపిఓ దేవకీదేవి, డిఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఈడిఎం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.